![]() |
![]() |

మీది మొత్తం 1000 అయ్యింది. రెండు లివర్లు ఎక్స్ట్రా అని కుమారి ఆంటీ చెప్పిన వాయిస్ ని ప్రస్తుతం డీజే తో మిక్స్ చేశారు. అది ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది. అయితే ఆ డీజే సాంగ్ కి సుమ రీల్ చేసింది. ఇందులో సుమ ఆ సాంగ్ కి తగ్గట్టుగా లిప్ సింక్ ఇచ్చేసరికి అది నెట్టింట ఫుల్ వైరల్ అవుతోంది.
బుల్లితెర స్టార్ మహిళ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మాటలతో స్టార్ హీరోలని, డైరెక్టర్ లను సైతం మెప్పిస్తూ యాంకరింగ్ లో కొత్త ఒరవడిని సృష్టించింది. ఇక కుమారీ ఆంటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ అయింది. ఈ క్రేజ్ తో తనకి బిబి మహోత్సవం అనే షోలో అఫర్ లభించింది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ షోలో కుమారీ ఆంటీ రావడంతో రచ్చ మాములుగా లేదు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో డీజే రిమిక్స్ రీల్స్, సాంప్రదాయిని సుప్పిని సద్దపూసని అనే రీల్స్ హావా నడుస్తోంది. చిన్న చిన్న సెలబ్రిటీల నుండి అగ్రతారల వరకు ఇన్ స్ట్రాగ్రామ్ లో రకరకాల పోస్ట్ లు రీల్స్ చేస్తుంటారు. దీనికంతటికి కారణం ట్రెండింగ్ లో ఉండాలని అందరు చూస్తున్నారు.

ఇక కుమారీ ఆంటీ వాయిస్ ని డీజే రీమిక్స్ చేయగా అది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. సుమ చేసిన ఈ రీల్ కి తెగ కామెంట్లు వస్తున్నాయి. సుమ చేసిన ఈ రీల్ ని టేస్టీ తేజ స్వయంగా కుమారీ ఆంటీకి చూపించాడు. అది చూసి ఆశ్చర్యపోతూ చాలా ప్రౌడ్ గా ఉందంటూ కుమారీ ఆంటీ ఆ వీడియోలో అంది. ఆ వీడియోని టేస్టీ తేజ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.
![]() |
![]() |